Friday, March 20, 2026
Homeసినిమామళ్లీ సునీల్ నవ్వుల్లో ముంచేస్తాడు: అనిల్ రావిపూడి

మళ్లీ సునీల్ నవ్వుల్లో ముంచేస్తాడు: అనిల్ రావిపూడి

Anil on Sunil: తెలుగు తెరపై కమెడియన్స్ సంఖ్య ఎక్కువే .. సందడి ఎక్కువే. అంతమందిలోను కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నవాడిగా సునీల్ కనిపిస్తాడు. కిసుక్కున నవ్వుతూ .. గోదావరి జిల్లాల యాసలో మాట్లాడుతూ ఆయన ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తరువాత హీరోల వేషాల వైపు వెళ్లిన ఆయన, అక్కడ ఎక్కువ కాలం పాటు కుదురుకోలేకపోయాడు. తిరిగి కమెడియన్ గానే కొనసాగాలనే నిర్ణయంతో వెనక్కి వచ్చేశాడు. అయితే కమెడియన్ గా ఆయనకి పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టే పాత్ర ఇంతవరకూ పడలేదనే చెప్పాలి.

అలాంటి ఒక పాత్ర కోసం .. అవకాశం కోసం సునీల్ ఎదురుచూస్తూ, విభిన్నమైన పాత్రలను చేసుకుంటూ వెళుతున్నాడు. మళ్లీ కమెడియన్ గా బిజీ అయ్యే సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు. తమ సినిమాతో సునీల్ అనుకున్నది నెరవేరుతుందని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ‘ఎఫ్ 3‘ సినిమాను గురించి ప్రస్తావించాడు. ‘ఎఫ్ 2’ అనేది భార్యభర్తలకు సంబంధించిన ఫ్రస్టేషన్. ‘ఎఫ్ 3’ విషయానికి వచ్చేసరికి, మనీ గురించిన ఫ్రస్టేషన్ తో కొనసాగుతుంది.

ఈ సినిమాలోని ముఖ్యమైన పాత్రలు డబ్బు కోసం ఎలా పరిగెత్తాయి? అలా చేయడం వలన ఎలాంటి ఇబ్బందులు  పడ్డారు? ఏం జరిగింది? అనేది కథ. ‘ఎఫ్ 2’ చూస్తూ ప్రేక్షకులు ఎంత ఎంజాయ్ చేశారో  .. ఈ సినిమా చూస్తూ కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో సునీల్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఆయన ఇంతగా నవ్వించే పాత్ర చేయలేదు. కొంత గ్యాప్ తరువాత ఆయన పూర్తిస్థాయి కమెడియన్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. సినిమా అంతా కూడా ఆయన తెరపై కనిపిస్తూనే ఉంటారు .. నవ్విస్తూనే ఉంటారు” అని చెప్పుకొచ్చాడు.

Also Read : మే 27నుంచి నవ్వులు పూయించనున్న‘ఎఫ్ 3’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular