Sunday, January 19, 2025
Homeసినిమాభగవంత్ కేసరి తర్వాత అనిల్ రావిపూడి సినిమా ఎవరితో..?

భగవంత్ కేసరి తర్వాత అనిల్ రావిపూడి సినిమా ఎవరితో..?

పటాస్ సినిమాతో కెరరీ్ స్టార్ట్ చేసి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.  ఆతర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3.. ఇలా వరుసగా సక్సెస్ సాధిస్తూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. అపజయం అనేది లేకుండా వరుసగా విజయాలు సాధిస్తూ కెరీర్ లో దూసుకెళుతున్నాడు. అందుకనే.. అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు, సార్ట్ ప్రొడ్యూసర్స్ ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. కమర్షియల్ హంగులతో మంచి ఎంటర్ టైనర్ లను అందిస్తుండడంతో అనిల్ సినిమా అంటే ఖచ్చితంగా సక్సెస్ ఖాయం అనే నమ్మకం ఏర్పడింది.

ప్రస్తుతం బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో బాలయ్యను అనిల్ రావిపూడి కొత్తగా చూపిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. అనిల్ రావిపూడి నెక్ట్స్ ఎవరితో సినిమా చేయనున్నారంటే.. చిరంజీవితో అని వార్తలు వస్తున్నాయి. కథ చెప్పు సినిమా చేద్దామని చిరంజీవి ఆపర్ ఇచ్చారట. దీంతో చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా ఉంటూనే.. తనదైన ఎంటర్ టైన్మెంట్ మార్క్ ఉండేలా స్టోరీ రెడీ చేస్తున్నాడట.

చిరంజీవి నటించిన భోళా శంకర్ మూవీ ఆగష్టు 11న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి కళ్యాణ్ కృష్ణతో సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని చిరంజీవి పుట్టినరోజైన ఆగష్టు 22న ప్రకటిస్తారని సమాచారం. ఆతర్వాత బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ తో సినిమా చేయాలి. అయితే.. ముందుగా కళ్యాణ్ కృష్ణ సినిమాను పూర్తి చేసి.. ఆతర్వాత మల్లిడి వశిష్ట్ తో మూవీ, అనిల్ రావిపూడితో మూవీని ఒకేసారి చేయాలి అనుకుంటున్నారట. మరి.. ఏం జరగనుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్