Sunday, September 29, 2024
Homeసినిమా‘కృష్ణ వ్రి౦ద విహారి’ పెద్ద హిట్ అవ్వాలి: అనిల్ రావిపూడి

‘కృష్ణ వ్రి౦ద విహారి’ పెద్ద హిట్ అవ్వాలి: అనిల్ రావిపూడి

KVV- Teaser: యంగ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య హీరోగా షెర్లి సెటియా హీరోయిన్ గా అనిష్ ఆర్.కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కృష్ణ వ్రి౦ద విహారి’ . ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్ పతాకం పై శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో అభిరుచి గల నిర్మాత ఉష మూల్పూరి నిర్మించారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్యఅతిధిగా విచ్చేసి టీజర్ లాంచ్ చేశారు.

చిత్ర దర్శకుడు అనిష్ ఆర్. కృష్ణ మాట్లాడుతూ “కృష్ణ వ్రి౦ద విహారి ఇట్స్ ఏ కూల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. 2018 లో నాగశౌర్య తో నా జెర్నీ స్టార్ట్ అయింది. అప్పుడు ఈ స్టోరీ చెప్పాను. ఇమ్మీడియెట్ గా ఒకే మనం చేద్దాం అన్నారు. డిసెంబర్ లో షూట్ స్టార్ట్ చేసి కరోన ఉన్న కూడా మధ్య మధ్యలో గ్యాప్ చూసుకొని ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేశాం. టీజర్ లో కృష్ణ ,వ్రి౦ద ల రొమాన్స్ చూసుంటారు. మూవీలో దీనికి మించి ఉంటుంది. ఓన్లీ రొమాన్స్ కాకుండా ఫుల్ కామెడీ ఉంటుంది. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ అందరూ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించడానికి ఏప్రిల్ 22న రాబోతుంది. అందర్నీ అలరిస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాం అన్నారు.

హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చింది. సెట్లో టీమ్ అందరితో చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఒకప్పుడు ఇండస్ట్రీలో రీ షూట్ తీస్తే.. సినిమా పోయింది అనేవాళ్ళు. ఇప్పుడు రీ షూట్ తీయకపోతే సినిమా పోయేలా ఉంది. పర్ఫెక్షన్ కోసం అలా తీసుకొచ్చారు. మా డైరెక్టర్ అనిష్, మా అమ్మ సినిమాకి ఎంత కావాలంటే అంత ఖర్చుపెట్టి కాంప్రమైజ్ అవకుండా ఈ సినిమా తీశారు. అందరికీ సినిమా నచ్చేంత వరకు తీస్తూనే ఉన్నాం. ఫైనల్ గా ఔట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ఐరా క్రియేషన్స్ నుండి సినిమా వస్తుంది.. గ్యారెంటీగా చాలా పెద్ద హిట్ కొట్టాలి అని కసితో ఈ సినిమా చేసింది. ఆ విషయంలో అచీప్ చేసింది మా అమ్మ. సినిమా చూశాను.. చాలా చాలా బాగుంది. మా అమ్మకి నేనంటే ఎంత ఇష్టమో నాకు హిట్ పడాలి అనేది ఇంకా ఇష్టం. అనిష్ మంచి కథతో చెప్పింది చెప్పినట్టు తీశారు. అనిల్ రావిపూడి గారి సినిమాలో ఎంత కామిడి ఉంటుందో నేను ఈ సినిమాలో అంత కామిడి చూశాను. అడవాళ్ళతో ఏదొ రకంగా సత్ సంబంధాలు ఉంటాయి.. ఆ కాన్సెప్ట్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సినిమా ఉంటుంది. సాయి శ్రీరామ్ ఫోటోగ్రఫీ సినిమాకి ప్రాణం. ఎలాగైనా ఈ సినిమాని పెద్ద బ్లాక్ బస్టర్ చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆయనే అనిష్ ని పంపించి కథ వినమన్నారు.. మంచి సినిమా చేశారు. సాగర్ వండర్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ తనతో 5సినిమాలు చేశాను. షెర్లిన్ చేసిన మస్క మూవీ చూసి ఈ సినిమాలో పెట్టడం జరిగింది. బ్యూటిఫుల్ గా చేసింది.. బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది తనకి.. ఏప్రిల్ 22న ఈ సినిమా విడుదలవుతుంది. అన్నారు.

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో థియేటర్స్ అన్నీ కళకళలాడుతున్నాయి. ఇలాగే ఇండస్ట్రీలో సినిమాలు ప్రశాంతంగా ఆడాలని కోరుకుంటున్నాను. ఐరా క్రియేషన్ బ్యానర్ అంటే సినిమాలు లవ్ చేస్తారు.. ఆ సినిమాకి పని చేసే టెక్నీషియన్స్ ని కూడా అంతే బాగా చూసుకుంటారు. సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. అది మంచి ఆలోచన. అదే కంటిన్యూ చేయాలి. మంచి సినిమాలు తీయాలని ఎప్పుడు ప్రయత్నిస్తూనే వుంటారు. తీస్తూనే వున్నారు. ఈ సినిమా కూడా ఛ‌లో కంటే పెద్ద సక్సెస్ అవ్వాలని నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. అనిష్ నాకు బాగా తెలుసు. మంచి టాలెంట్ ఉంది. కచ్చతంగా ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టబోతున్నాడు. సాయి శ్రీరామ్ చక్కటి విజువల్స్ ఇచ్చాడు. సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. శౌర్య ఎవరి సపోర్ట్ లేకుండా ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ స్థాయికి రీచ్ అయ్యాడు. డెఫినెట్ గా శౌర్య ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడని అనుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అయి అందరికీ మంచి పేరు తీసుకు రావాలి అన్నారు.

Also Read : వేసవి రేసులో ‘కృష్ణ వ్రింద విహారి’

RELATED ARTICLES

Most Popular

న్యూస్