Sunday, January 19, 2025
Homeసినిమాపవర్ స్టార్ - అనిల్ రావిపూడి మూవీ.?

పవర్ స్టార్ – అనిల్ రావిపూడి మూవీ.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో రూపొందిన వకీల్ సాబ్ మూవీ సక్సస్ సాధించింది. ఈ చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా చేస్తానని పవన్ మాట ఇచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్‌ తో మరో సినిమా చేసేందుకు దిల్ రాజుకు ఓ డైరెక్టర్ కావాలి. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో ఎఫ్-3 సినిమా చేస్తున్నారు. అయితే.. పవర్ స్టార్ తో సినిమా చేసేందుకు అనిల్ అయితే బాగుంటుందని.. ఈ కాంబినేషన్ సెట్ చేసే పనిలో ఉన్నారట దిల్ రాజు.

పవన్ కళ్యాణ్ కూడా అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు ఓకే చెప్పారట. ఇక అనిల్ రావిపూడి పవర్ స్టార్ కి తగ్గ స్టోరీ రెడీ చేయడం.. పవన్ తో ఓకే చేయించుకోవడం ఒకటే మిగిలిందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయ్యప్పనున్ కోషియమ్ రీమేక్, హరి హర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా చేయనున్నారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలిసింది. ఈ మూడు సినిమాలు పూర్తైన తర్వాత దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేసే ఛాన్స్ ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్