Saturday, January 18, 2025
HomeసినిమాAnil Ravipudi: అనిల్ రావిపూడి నెక్ట్స్ ఏంటి..?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్ట్స్ ఏంటి..?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ‘పటాస్’ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు అనిల్ రావిపూడి.  ee సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. అపజయం అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తున్నాడు. ప్రస్తుతం నటసింహం నందమూరి బాలయ్యతో భగవంత్ కేసరి అనే భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు ట్రెమండస్ రెస్సాన్స్ వచ్చింది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు.  దసరాకి భగవంత్ కేసరి చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

అయితే.. భగవంత్ కేసరి తర్వాత బాలయ్య బాబీతో సినిమా చేస్తున్నాడు. మరి.. అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేయనున్నాడనేది ఆసక్తిగా మారింది. నాగార్జునతో సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి కానీ.. ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదని తెలిసింది. మెగాస్టార్ చిరంజీవితో అనిల్ సినిమా ఉంటుందని, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు  ఈ సినిమాను నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి.

చంటబ్బాయి టైపులో మంచి కామెడీ ఎంటర్ టైనర్ గా ఇది ఉంటుందని తెలిసింది. కళ్యాణ్ కృష్ణది కూడా ఇదే తరహా అయినప్పటికీ.. అందులో ఎమోషన్స్ కి సమాన ప్రాధాన్యం ఉంటుంది కానీ అనిల్ మూవీలో రౌడీ అల్లుడు రేంజ్ మాస్ ని బయటికి తీస్తారని వినిపిస్తుంది. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. మరి.. ఈ సినిమా పై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్