Sunday, January 19, 2025
Homeసినిమాచరణ్ సినిమాలో అంజలి పాత్ర అదేనా?! 

చరణ్ సినిమాలో అంజలి పాత్ర అదేనా?! 

Anjali luck: అంజలి .. అచ్చ తెలుగు అమ్మాయి. గోదారి ప్రవాహంలా ఎప్పుడు చూసినా గలగలా మాట్లాడుతూ ఉంటుంది. అల్లరి చేస్తూ .. ఆకతాయితనంతో కనిపించే పాత్రలు ఆమెకి దగ్గరగా ఉండటం వలన, ఆ తరహా పాత్రలలో ఆమె ఇమిడిపోతుంది. సరదాగా .. సందడిగా కనిపించే పాత్రలతో పాటు, గంపెడు బాధను గుండెల్లో దాచుకునే పాత్రలలో సైతం ఆమె మెప్పించింది. తమిళంలో పాటు తెలుగులోను కొన్ని హిట్లను ఆమె తన ఖాతాలో వేసుకోగలిగింది. అలాంటి అంజలికి ఈ మధ్య అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి.

కథానాయికగా ఆమె తన ప్రయాణాన్ని ప్రారంభించి 15  ఏళ్లు దాటిపోవడం వలన కావొచ్చు .. కొత్త కథానాయికల రాక ఎక్కువ కావడం వలన కావొచ్చు. అందువలన కథానాయికగానే  కాకుండా కొన్ని ముఖ్యమైన .. కీలకమైన పాత్రలను పోషిస్తూ వెళుతోంది. ఆ మధ్య ‘నిశ్శబ్దం’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన అంజలి, ఆ తరువాత ‘వకీల్ సాబ్’లోను కనిపించింది. ఇక రీసెంట్ గా ఆమె ‘ఎఫ్ 3’ సినిమాలోను ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. మే 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలోనే చరణ్ హీరోగా శంకర్ రూపొందిస్తున్న సినిమాలో అంజలి ఒక కీలకమైన పాత్రలో చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి.  దాంతో ఆమె ఈ సినిమాలో ఏ పాత్రలో కనిపించనుందనే ఆసక్తి చోటు చేసుకుంది. ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టుగా  ఆరంభంలోనే వార్తలు వచ్చాయి. తండ్రీకొడుకులుగా చరణ్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నాడని అంటున్నారు. వయసుమళ్లిన చరణ్ పాత్ర సరసన అంజలి కనిపించనుందని అంటున్నారు. ఇక యంగ్ చరణ్ జోడిగా కియారా అందాల సందడి చేయనుంది. ఈ ప్రచారం ప్రకారం చూసుకుంటే అంజలికి మంచి రోల్ పడినట్టే. చూడాలి మరి .. ఈ సినిమా ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో!

RELATED ARTICLES

Most Popular

న్యూస్