Saturday, January 18, 2025
Homeసినిమాఅర్జున్ "ఆంజనేయస్వామి గుడి" ప్రారంభం.

అర్జున్ “ఆంజనేయస్వామి గుడి” ప్రారంభం.

యాక్షన్ కింగ్ అర్జున్..నాలుగు దశాబ్దాలుగా సౌత్ ఇండియా వెండి తెరపై  వినిపిస్తున్న పేరది. నటనతో పాటు సామాజిక సేవలో  సేవ చేస్తూ గోప్యంగా ముందుకు సాగుతుంటారు అర్జున్. అటువంటి అర్జున్ లో ఆంజనేయ స్వామి భక్తుడున్నాడు. అందుకే ఆయన చెన్నయ్  ఎయిర్ పోర్ట్ దగ్గరలో తన సొంత స్థలంలో “ఆంజనేయ స్వామి “గుడికి శ్రీకారం చుట్టారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా ,ఎన్నో సంవత్సరాలుగా  రూపొందించిన  ఈ గుడి భక్తుల సందర్శనార్ధం, సర్వాంగ సుందరంగా రెడీ అయ్యింది. జులై 1న మహా కుంభాభిషేకం జరుపుకోనుంది. ఈ విష‌యాన్ని అర్జున్ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌పరిచారు. ఆల‌య ప్రారంభోత్స‌వాన్ని చాలా ఘ‌నంగా చేయాల‌నుకున్నాన‌ని, కానీ క‌రోనా ప‌రిస్థితుల దృష్టిలో ఉంచుకుని, ఎవ‌రినీ ఆహ్వానించ‌డం లేద‌ని తెలియ‌జేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్