Thursday, March 12, 2026
Homeసినిమాపీరియాడిక్ లవ్ స్టోరీ 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' రిలీజ్ డేట్ ఫిక్స్

పీరియాడిక్ లవ్ స్టోరీ ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ రిలీజ్ డేట్ ఫిక్స్

టైటిల్, కాన్సెప్ట్ తో పాటు లిరికల్ పాటలతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచిన చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’.  చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన ఈ చిత్రంలో మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకం పై యష్ రంగినేని నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూలై 21న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. విడుదల తేదీ ఖరారైన సందర్భంగా నిర్మాత యష్ రంగినేని మాట్లాడుతూ… గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. పీరియాడిక్ సినిమాగా ఆకట్టుకుంటుంది.

దర్శకుడు చెందు ముద్దు ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించారు. 80 దశకం నేపథ్యంతో సినిమా సాగుతుంది. మా సంస్థకు మంచి పేరు తెచ్చే చిత్రమవుతుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్, లిరికల్ సాంగ్స్ కు మంచి స్పందన వస్తోంది. జూలై 21న మా సినిమాను విడుదల చేస్తాం. ఖచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular