Sunday, January 19, 2025
Homeసినిమాఅమెజాన్ ప్రైమ్ లో 'అన్నీ మంచి శకునములే'

అమెజాన్ ప్రైమ్ లో ‘అన్నీ మంచి శకునములే’

లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ కలిసిన కథలను తనదైన మార్క్ తో తెరకెక్కించి, ఈ రెండు వర్గాల ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించడం నందినీ రెడ్డి ప్రత్యేకత. అలా ఆమె దర్శకత్వంలో వచ్చిన సినిమానే ‘అన్నీ మంచి శకునములే’. టైటిల్ వినగానే మళ్లీ నందినీ రెడ్డి నుంచి మరో మంచి కంటెంట్ రాబోతోందని అంతా అనుకున్నారు. ఇక ఈ సినిమా స్వప్న సినిమా బ్యానర్ పై రావడంతో కూడా అంచనాలు ఏర్పడ్డాయి. మే 18వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకి, ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు.

అలాంటి ఈ సినిమా ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళ … మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను అందుబాటులో ఉంచారు. సంతోష్ శోభన్ – మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ సినిమాకి, మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. రాజేంద్రప్రసాద్ .. రావు రమేశ్ .. గిరిబాబు .. గౌతమి వంటి సీనియర్ ఆర్టిస్టులు ఈ కథను ముందుకు నడిపించారు. ఇంతమంది ఉన్నప్పటికీ మాళవిక నాయర్ నటన ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది.

సాధారణంగా ఒకరి పట్ల ఒకరికి గల ఆకర్షణ ప్రేమలో పడటానికి కారణం అవుతుంది. ఆ తరువాత ఒకరి అభిప్రాయాలు ఒకరికి .. ఒకరి అభిరుచులు ఒకరికి గొప్పగా అనిపిస్తాయి. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితిని తీసుకొస్తాయి. ఆ తరువాత ఏదో ఒక సందర్భంలో .. ఎక్కడో ఒక చోట ‘ఇగో’ అడ్డుపడుతుంది. ఆ విషయాన్ని అంగీకరించడానికి ఇద్దరూ సిద్ధంగా ఉండరు. అక్కడి నుంచి అలకలు .. కోపాలు షరా మామూలు. ఇదిగో ఇలాంటి ఒక కథతోనే ఈ సినిమా నడుస్తుంది. ఓటీటీ ద్వారా ఈ సినిమా ఏ స్థాయిలో యూత్ కి కనెక్ట్ అవుతుందో చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్