Saturday, March 14, 2026
Homeసినిమాశ్రీలీల సంక్రాంతి వరకూ వెయిట్ చేయవలసిందే!

శ్రీలీల సంక్రాంతి వరకూ వెయిట్ చేయవలసిందే!

ఇప్పుడు టాలీవుడ్ లో ఒక రేంజ్ లో దూసుకుపోతున్న హీరోయిన్ ఎవరంటే వెంటనే శ్రీలీల పేరు వినిపిస్తుంది. అంతగా ఆమె వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అయితే వరుసగా ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయితే, ఎంతటి స్టార్ హీరోయిన్ కెరియర్ పైన అయినా ఎంతో కొంత ప్రభావం చూపుతుంది.  అలాంటి ఎఫెక్ట్ శ్రీలీల కెరియర్ పై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆమెకి ఫ్లాపులు ఎదురవుతూ వస్తున్నాయి.

‘ధమాకా’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను ఇచ్చిన తరువాత, ‘స్కంద’తో ఆమె ఫ్లాప్ అందుకుంది. అయితే  ఆ తరువాత వచ్చిన ‘భగవంత్ కేసరి’ సంచలన విజయాన్ని అందించడంతో, ‘స్కంద’ ఫ్లాప్ ప్రభావం అంతగా పడలేదు. ఆ సినిమా పరాజయాన్ని గురించి పెద్దగా చర్చలు కూడా జరగలేదు. అయితే ఆ సక్సెస్ ను కూడా ఆమె ఎక్కువ కాలం ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే ‘ఆదికేశవ’ పేరుతో ఆమెకి మరో ఫ్లాప్ పడింది. ఒక ఫ్లాప్ తరువాత ఒక హిట్ కొడుతూ వస్తోంది గనుక, సహజంగానే ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మెన్’ హిట్ అవుతుందని చాలామంది అనుకున్నారు.

అయితే ఈ నెల 8వ తేదీన విడుదలైన ‘ఎక్స్ ట్రా’ ప్రేక్షకులను నిరాశపరిచింది. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఫస్టాఫ్ ఫరవాలేదనిపించినా, సెకండాఫ్ అసంతృప్తిని  కలిగించింది. నితిన్ – శ్రీలీల ఇద్దరూ కూడా మరో ఫ్లాప్ ను తమ ఖాతలో వేసుకోవలసి వచ్చింది. ‘ఆదికేశవ’ .. ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మెన్’ రెండు ఫ్లాపులు వెంటవెంటనే పడటంతో, శ్రీలీల దృష్టి ఇప్పుడు సంక్రాంతికి వచ్చే ‘గుంటూరు కారం’ సినిమాపైనే ఉంది. ఆ సినిమా హిట్ అయితే పాత ఫ్లాపుల ప్రభావం నుంచి తొందరగా బయటపడొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular