Wednesday, March 11, 2026
Homeసినిమా‘శ్రీదేవి సోడా సెంటర్’ నుంచి చుక్కల మేళం లిరికల్ సాంగ్

‘శ్రీదేవి సోడా సెంటర్’ నుంచి చుక్కల మేళం లిరికల్ సాంగ్

సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకం పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్లలో  విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్‌కు, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ‘చుక్కల మేళం’ అనే లిరికల్ సాంగ్ విడుదల చేసింది చిత్ర యూనిట్. మణిశర్మ ఈ పాటకు కూడా అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు. విడుదలైన క్షణం నుంచే పాటకు మంచి స్పందన వస్తుంది.

ఇండియా వ్యాప్తంగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు చాలా మంచి బిజినెస్ జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 12 కోట్లకు అమ్ముడయ్యాయి. సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బ్రిడ్జ్ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత లక్ష్మణ్ శ్రీదేవి సోడా సెంటర్ హక్కులను సొంతం చేసుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలవుతున్న శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను వీలైనంత వరకు భారీగానే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు లక్ష్మణ్. ఈయన ఈ మధ్యే విడుదలై బ్లాక్‌బస్టర్ అయిన ‘జాతి రత్నాలు’ ను లక్ష్మణ్ గారు డిస్ట్రిబ్యూట్ చేశారు. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular