Friday, March 20, 2026
HomeTrending Newsదళితబంధుకు మరో 500 కోట్లు విడుదల

దళితబంధుకు మరో 500 కోట్లు విడుదల

దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడుతున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ. 500 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలుకోసం మొత్తం 2000 కోట్ల నిధులు విడుదల చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు.
మొదటి విడతలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన రూ.500 కోట్ల తో పాటు ఇప్పుడు విడుదల చేసిన రూ.500 కోట్లు కలిపి హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పైలట్ ప్రాజెక్టు కు గాను మొత్తం రూ. 1000 కోట్ల నిధులు విడుదలయ్యాయి. కాగా.. వారం రోజుల్లోపు మరో రూ. 1000 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనున్నది. దాంతో సిఎం కెసిఆర్ ప్రకటించిన రూ. 2000 కోట్ల నిధులు పూర్తి స్థాయిలో విడుదల కానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular