Saturday, January 18, 2025
Homeసినిమామరో టీజర్ వదిలే ఆలోచనలో 'కన్నప్ప' టీమ్?

మరో టీజర్ వదిలే ఆలోచనలో ‘కన్నప్ప’ టీమ్?

మంచు విష్ణు కథానాయకుడిగా ‘కన్నప్ప’ సినిమా రూపొందుతోంది. ఆయన సొంత నిర్మాణంలో పాన్ ఇండియా సినిమాగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ న్యూజిలాండ్ లో జరిగింది. అక్కడ ఫారెస్టు ఏరియాకి సంబంధించిన విజువల్స్ మరింత అందంగా వచ్చే అవకాశం ఉండటం వలన, ఆ లొకేషన్స్ ను సెట్ చేసుకున్నారని అంతా అనుకున్నారు. అయితే రీసెంటుగా వదిలిన టీజర్ చూస్తే, గుర్రాలపై ఛేజింగ్ సీన్స్ హాలీవుడ్ రేంజ్ లో కనిపించాయి.

‘ఇంతమందిని ఎంతమంది కలిసి చంపారు?’ అనే ప్రశ్నకి, ‘ఒక్క తిన్నడే చంపాడు’ అనే డైలాగ్  టీజర్లో వినిపిస్తుంది. ఇక ‘కన్నప్ప’ లుక్ కూడా డిఫరెంట్ గా అనిపించింది. ‘కన్నప్ప’కి తన కండబలంపై నమ్మకం ఎక్కువ. ఆ తరువాత ఆ కండబలానికి కాలం కూడా కలిసి రావలసిందే .. ఆ కాలమే ఈశ్వర స్వరూపం అని అర్థం చేసుకుని మారిపోతాడు .. మహాభక్తుడైపోతాడు. పాత ‘భక్త కన్నప్ప’లో ఇదే చూపించారు.

భక్తుడిగా మారడానికి ముందు ‘భక్త కన్నప్ప’లో కాస్త మొండితనం ఎక్కువని అప్పట్లో చూపించారు. కానీ ఈ ‘కన్నప్ప’  విషయానికి వచ్చేసరికి, భక్తుడిగా మారడానికి ముందు ఆయనను ఓ యుద్ధవీరుడిగా చూపించే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తోంది. ఇక లొకేషన్స్ పరంగా చూసుకుంటే ఈ కథ తెలుగుదనానికి దూరంగా వెళ్లిందేమోననే సందేహం కలుగుతోంది. మొన్నటి టీజర్ కి ఆశించినస్థాయి రెస్పాన్స్ రాకపోవడంతో, మరో టీజర్ ను వదిలే ఆలోచనలో టీమ్ ఉన్నట్టుగా టాక్. చూడాలి మరి ఏం చేస్తారో.

RELATED ARTICLES

Most Popular

న్యూస్