Sunday, January 19, 2025
Homeసినిమా ANT ఫస్ట్ లుక్ రిలీజ్

 ANT ఫస్ట్ లుక్ రిలీజ్

Ant Movie First Look : నూతన చిత్ర నిర్మాణ సంస్థ ఏవీఆర్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం  ‘ఏఎన్ టి. లక్కీ రాథోడ్, రింకల్ లెవువ హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కుతున్న  ‘ఏఎన్ టి’ సినిమా ఫస్ట్ లుక్ ఆవిష్కరించారు.  రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో  ఫస్ట్ లుక్ ను సినిమా యూనిట్ రిలీజ్ చేసింది.

హర్రర్ కథాంశంతో రూపొందిస్తున్న లవ్ సినిమా అని హీరో లక్కీ రాథోడ్ చెప్పారు. తన క్యారెక్టర్ ఇందులో చాలా డిఫరెంట్ గా ఉంటుందని అన్నారు. తన రోల్ ఎంత డిఫరెంట్ గా ఉంటుందో ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోందని ఆయన తెలిపారు. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల కంటే భిన్నంగా ఉంటుందన్నారు. ఎనభై శాతం షూటింగ్ పూర్తయిందని అన్నారు. బ్యాలన్స్ షెడ్యూల్ వైజాగ్ లో చిత్రీకరిస్తామని చెప్పారు.

ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు నజీమ్ చెప్పారు.   లక్కీ రాథోడ్, రింకల్  కొత్తవాళ్ళైనప్పటికీ.. ప్రతి సన్నివేశంలో చాలా బాగా ఇన్వాల్వ్ అయి న‌టించార‌ని తెలిపారు. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కావడం చాలా సంతోషంగా ఉందని హీరోయిన్ రింకల్ లెవువ అన్నారు. తన రోల్ చాలా బాగా ఉందని, ఇంత మంచి రోల్ ఇచ్చిన  దర్శక నిర్మాతలకు కృతజ్ఞత‌లు తెలియ‌చేస్తున్నాను అని రింకల్ అన్నారు. ఇతర పాత్రల్లో తొలిమామిడి, ఆర్ కె చారి, రీతూ కన్వత్ , ఆనందితా దాస్ నటించారు. ఈ చిత్రానికి సుకుమార్ సంగీతం అందిస్తున్నారు.

Also Read : ప్రభుత్వ జూనియర్ కళాశాల’ ఫస్ట్ లుక్ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్