Thursday, September 19, 2024
HomeTrending Newsమోడీ,కెసిఆర్ ల రైతు వ్యతిరేక కుట్రలు

మోడీ,కెసిఆర్ ల రైతు వ్యతిరేక కుట్రలు

Anti Farmer Conspiracies Of Modi And Kcr :

ధాన్యం కొనుగోలు మూత వేశారంటే అదాని, అంబాని లకు అంటగట్టేందుకు ప్రధాని నరేంద్ర మోది, సిఎం కెసిఆర్ కుట్ర చేస్తున్నారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఆరోపించారు. అదాని, అంబానిలకు శాశ్వతంగా రైతులను బానిసలను చేసేందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దేశ వ్యవసాయాన్ని అదాని, అంబానీలకు కట్టపెట్టేందుకు నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయత్నాలకు కెసిఆర్ సహకరిస్తున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. రైతుల మరణాలకు కారణమైన నరేంద్ర మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. తెలంగాణ తీసుకొచ్చింది కెసిఆర్ కుటుంబం వ్యాపారం చేసుకునేందుకా అని ప్రశ్నించారు. కెసిఆర్ ఢిల్లీ జంతర్ మంతర్ లో వడ్ల కొనుగోలు కోసం ధర్నా చేయాలి. కెసిఆర్ సచ్చుడో వరి ధాన్యం కేంద్రం కొనుగోలు చేయటమో జరగాలన్నారు. తెరాస బిజెపితో అంటకాగటం మానుకొని తెలంగాణ రైతాంగం తరపున ఉంటారని భావించాం.

పార్లమెంటులో అన్ని పార్టీలు కనీస మద్దతు ధర కోసం చట్టం తీసుకురావాలని ఒత్తిడి తీసుకొస్తుంటే తెరాస మాత్రం ధాన్యం కొనుగోలుకు దేశమంతా ఒకే విధానం ఉండాలని చర్చ తప్పుదారి పట్టేందుకు కేంద్రానికి సహకరించింది. తెరాస, బిజెపిల మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందం ప్రకారమే తెరాస ఎంపిలు వ్యవహరిస్తున్నారని రేవంత్ విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసినా కేంద్రం, రాష్ట్రం కుట్రలు మానుకోలేదు. అందులో భాగంగానే వర్షాకాల కొంటాం కాని ఏసంగి పంట కొనమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పటం దురదృష్టకరం. కేంద్రం కాకుంటే రాష్ట్రం కొంటుందని అనుకుంటే సాయంత్రానికి కెసిఆర్ కూడా కిషన్ రెడ్డి బాటలోనే ప్రకటన చేశారు. కేంద్రం కొనదు కనక రాష్ట్రం కొనుగోలు చేయదని నిన్న మంత్రివర్గ సమావేశం పెట్టి మరి చెప్పాడు. కోటి ఎకరాల మాగాణం చేసింది ఇందుకోసమేనా అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

తెలంగాణలో వరి వద్దు అన్నపుడు ప్రత్యామ్నాయ విధానాలు ఏమున్నాయో కెసిఆర్ చెప్పటం లేదు. గతంలో మొక్కజొన్న పండించే వారిని గిట్టుబాటు ధర రాదని వద్దన్నారు. నిజామాబాద్ లో ఎర్ర జొన్నలు వద్దన్నాడు. పసుపు బోర్డు అని ఒకడు. పసుపు పరిశోధన కేంద్రం అని మరొకడు నిజామాబాద్ పసుపు రైతులను మోసం చేశారు. తెలంగాణ మెట్ట ప్రాంతం.. ఇక్కడ తోటల సాగుకు అనుకూలంగా ఉంటుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని ప్రోత్సహించింది. ఈ రోజు పండ్ల తోటలకు కెసిఆర్ ప్రభుత్వం నుంచి సహకారం లేదు. ఈ రోజు వరి వేస్తె ఉరి అనే విధంగా కెసిఆర్ చేశాడు.

ఛత్తీస్ ఘడ్ లో రబీలో ప్రత్యామ్నాయ పంటల కోసం ముఖ్యమంత్రి భుపేష్ భాఘెల్ తొమ్మిది వేలు అదనంగా ఇచ్చి రైతులను ప్రోత్సహించారు. బాయిల్డ్ రైస్ కోసం కేంద్రమంత్రిని కలిస్తే మెడ మీద కత్తి పెట్టి రాయించాడని కెసిఆర్ ఎలా చెపుతారు. మెడ మీద కత్తి పెడితే నీ ఫాం హౌస్ రాసిస్తావా? నీ ఆస్తులు నీ పిల్లల ఆస్తుల రాసిస్తావా? కాలేశ్వరంలో అక్రమాలు జరిగాయి కనుకనే కేంద్రం ఆడించి నట్టు కెసిఆర్ ఆడుతున్నాడు. కెసిఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 20 శాతమే కొనుగోలు చేసింది. కోతలు అయిపోయి రాష్ట్రమంతా కల్లాల్లో ఉన్న ధాన్యం అకాల వర్షాలకు తడిసిపోతోంది. రైతు వ్యతిరేక చట్టాలు రద్దయినా కెసిఆర్, మోడీ ప్రభుత్వాలు కుట్రలు ఆపటం లేదు. కెసిఆర్ ఉకదంపుడు ఉపన్యాసాలు మానుకొని హైదరాబాద్ వదిలి ఢిల్లీ రావాలి. ధాన్యం కొనుగోలు కోసం జంతర్ మంతర్ దగ్గర దీక్షా చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్