Saturday, January 18, 2025
Homeసినిమామళ్లీ రంగంలోకి దిగిన అనుష్క!

మళ్లీ రంగంలోకి దిగిన అనుష్క!

తెలుగు .. తమిళ భాషల్లో అనుష్కకి విపరీతమైన క్రేజ్ ఉంది. మలయాళ .. హిందీ భాషల నుంచి అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె పెద్దగా ఆసక్తిని చూపించలేదు. ‘బాహుబలి 2’ నుంచి ఆమె ఆశించినంత వేగంలో సినిమాలు రావడం లేదు. ఒకానొక దశలో సినిమాలు చేయడం మానేసిందనే టాక్ కూడా వచ్చింది. అయితే ఆ తరువాత ఆమె నాయిక ప్రధానమైన సినిమాలు చేస్తూ వెళుతోంది. అలా వచ్చిన ‘భాగమతి’ భారీ విజయాన్ని అందుకుంది.

‘భాగమతి’ తరువాత అనుష్క ఇక వరుస సినిమాలు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆ తరువాత కూడా గ్యాప్ తీసుకోవడం అభిమానులను ఆలోచనలో పడేసింది. కొంత గ్యాప్ తో అనుష్క ఆ మధ్య చేసిన ‘సైలెన్స్’ .. ఈ మధ్య కాలంలో చేసిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. నాయిక ప్రధానమైన పాత్రలను చేయడంలో అనుష్కకి మంచి క్రేజ్ ఉంది. అలాంటి సినిమాలకు మంచి ఆదరణ కూడా లభించింది. అలాంటి అనుష్క చేసిన ఆ రెండు సినిమాలు ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు.

ఆ సినిమాల తరువాత అనుష్క యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఆమె క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడం కోసం సెట్స్ పైకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాదులో జరుగుతోంది. ‘వేదం’ తరువాత క్రిష్ దర్శకత్వంలో ఆమె చేస్తున్న సినిమా ఇది. రాజీవ్ రెడ్డి – ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ కథ కూడా నాయిక ప్రధానమైనదే. తనకి అన్యాయం చేసినవారిపై నాయిక చేసే పోరాటమే ఈ కథ.

RELATED ARTICLES

Most Popular

న్యూస్