Saturday, January 18, 2025
Homeసినిమామలయాళ సినిమా సెట్స్ పైకి అడుగుపెట్టిన అనుష్క!

మలయాళ సినిమా సెట్స్ పైకి అడుగుపెట్టిన అనుష్క!

అనుష్క .. తెలుగు తెర చందమామగా అభిమానులు చెబుతారు. చక్కని కనుముక్కుతీరుతో, జానపద .. చారిత్రక కథలకు సరిపోయే ఆకర్షణీయమైన రూపం ఆమె సొంతం. తెలుగులో నాయిక ప్రధానమైన సినిమాలు చేయడంలోనూ ఆమె తన ప్రత్యేకతను చాటుకుంది. అలాంటి అనుష్కకి ఆ మధ్య చేసిన ‘సైలెన్స్’ .. ఆ తరువాత నవీన్ పోలిశెట్టితో చేసిన సినిమా కూడా పెద్దగా కలిసి రాలేదు. ఈ నేపథ్యంలోనే క్రిష్ దర్శకత్వంలో ఆమె ఒక సినిమా చేస్తోంది. అలాంటి అనుష్క మలయాళంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకోవడం విశేషం.

కెరియర్ ఆరంభించిన దగ్గర నుంచి కూడా అనుష్కకి హిందీ .. మలయాళ సినిమాల నుంచి భారీ ఆఫర్లు వచ్చాయి. అవి కూడా స్టార్ హీరోల కాంబినేషన్ లో కావడం విశేషం.  కానీ అనుష్క ఆ సినిమాలపై పెద్దగా ఆసక్తిని చూపించలేదు. తెలుగు .. తమిళ సినిమాల వైపే ఆమె ఎక్కువగా మొగ్గు చూపించింది. ఈ రెండు భాషల్లోను ఆమె స్టార్ స్టేటస్ ను అందుకుంది. అలాంటి అనుష్క ఇంతకాలానికి ఒక మలయాళ సినిమాను అంగీకరించింది. ఆ సినిమా పేరే ‘కథనార్ – ది వైల్డ్ సోర్సె రర్’.

జయసూర్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో వినీత్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. గోకులం గోపాలన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాహుల్ సుబ్రమణియన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమా, అనేక ప్రత్యేకతలను .. విశేషాలను యాడ్ చేసుకుంటూ వెళుతోంది. నిన్ననే ఈ సినిమా షూటింగులో  అనుష్క జాయినైంది. మలయాళంతో పాటు, తెలుగులోను ఈ సినిమా విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్