Wednesday, March 11, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ఇది చీని, నిమ్మ సంవత్సరం

ఇది చీని, నిమ్మ సంవత్సరం

నిమ్మ, బత్తాయి (చీని) అభివృద్ధికి ప్రాధాన్యం కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయం నిర్వహించిన జూమ్ కాన్ఫెరెన్స్ లో పాల్గొన్న మంత్రి కన్నబాబు పలువురు ఉన్నాతాధికారులు, శాస్త్రవేత్తలు, నిమ్మ, బత్తాయి సాగు రైతులతో మాట్లాడారు.

బత్తాయి, నిమ్మ పంటల సాగు, దిగుబడి, ఎగుమతులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ ఏడాదిని “నిమ్మ, బత్తాయి సంవత్సరంగా” ప్రకటించాలని నిర్ణయించినట్లు కన్నబాబు చెప్పారు. ధృవీకరించిన నాణ్యమైన మొక్కలు, అంట్లు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఉద్యాన శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ సముక్తంగా కృషి చేయాలని కోరారు.

శాస్త్రీయ పరమైన యాజమాన్య సాగు పద్దతులపై రైతులకు అవగాహనా పెంచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన మంత్రి, ఆర్బికేల ద్వారా నిమ్మ, బత్తాయి సాగు శిక్షణ , సమగ్ర యాజమాన్య పద్దతుల పై అవగాహన కల్పిస్తున్నామని వివరించారు.

సిట్రస్ పండ్ల ఉత్పత్తిలో మన రాష్టం దేశంలోనే అగ్ర స్థానంలో వుందని, బత్తాయి, నిమ్మ పండ్ల దేశీయ రకాలకు మరింత ప్రాచుర్యం కల్పించి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సిట్రస్ జాతి కాయలు, పండ్లు రోగ నిరోధక శక్తిని ఎంతగానో పెంచుతాయని, వాటిని ప్రజలకు మరింతగా అందుబాటులోకి తేవాలని మంత్రి కన్నబాబు దిశా నిర్దేశం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular