ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24వరకూ జరగనున్నాయి. తొమ్మిది రోజులపాటు సభ సమావేశం కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు మొదలైన సంగతి తెలిసిందే. మొదటిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్, చీఫ్ విప్ ప్రసాద రాజు, శ్రీకాంత్ రెడ్డి, టిడిపి ఉపనేత అచ్చెన్నాయుడు ఈ భేటీలో పాల్గొన్నారు. సభలో చర్చించాల్సిన అంశాలు, బడ్జెట్, పద్దులు తదితర అంశాలు చర్చకు వచ్చాయి.
రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపడతారు. ఎల్లుండి రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ను ప్రవేశ పెడతారు. బడ్జెట్, పద్దులపై చర్చ జరుగుతుంది. 24న ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీ ఆమోదించనుంది. దీనితో సమావేశాలు ముగుస్తాయి.
Also Read : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం