AP Assembly: ఆంధ్ర ప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లు 2022కు శాసన సభ ఆమోదం తెలిపింది. అనంతరం అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
మార్చి8న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. తొలిరోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. 9న దివంగత మంత్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేసిన అనంతరం సభ 11వ తేదీకి వాయిదా పడింది.
జంగారెడ్డి గూడెంలో మరణాలపై సభలో చర్చించాలంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నిరసన చేసింది. 14వ తేదీన ఐదుగురు టిడిపి ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామా నాయుడు, పయ్యావుల కేశవ్, డిబివి స్వామి లను సభా సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేశారు. మిగిలిన సభ్యులు ఆందోళన కొనసాగించడంతో సభ్యులను రోజువారీ సస్పెండ్ చేశారు.
Also Read : మండలిలో మంగళసూత్రాలు: ఛైర్మన్ ఆగ్రహం