short discussion: పెగాసస్ అంశంపై స్వల్పకాలిక చర్చకు రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అంగీకరించారు. నేడు సభ సమావేశం కాగానే రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా మన ఫోన్లను చట్ట వ్యతిరేకంగా మానిటర్ చేయడం, అనుమతి లేని పరికరాలను వాడి టాపింగ్ చేస్తున్నారని, దేశవ్యాప్తంగా పెగాసస్ అంశం సంచలనం రేకెత్తించిందని గుర్తు చేశారు. కొంతమంది ఈ విషయమై సుప్రీం కోర్టుకు వెళ్ళినప్పుడు మాజీ న్యాయమూర్తి ఆర్వీ రవీంద్రన్ నేతృత్వంలో ఓ కమిటీని విచారణకు నియమించిందని చెప్పారు.
దేశంలోనే సీనియర్ రాజకీయ నేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ పెగాసస్ అంశంపై చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చ జరగాల్సి ఉందని, దీనికి అనుమతించాలని స్పీకర్ ను కోరారు. పెగాసస్ స్పై వేర్ వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగిస్తుందని, భార్యాభర్తలు మాట్లాడుకున్నా అది కూడా మానిటర్ చేసే అవకాశం ఉందని, దీనిపై కూలంకషంగా చర్చ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు విచారణ సమయంలోనే ఇలాంటి అభియోగాలు బైటకు రావడం గమనంలోకి తీసుకోవాలన్నారు.
ఇప్పటికే దీనిపై నోటీసు ఇచ్చామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సభ దృష్టికి తెచ్చారు. పెగాసస్ స్పై వేర్ కొన్నారో లేదో తేల్చాల్సిన అవసరం ఉందని, పదవీ ప్రమాణ స్వీకారం సమయంలో చేసిన ప్రతిజ్ఞను ధిక్కరించి ఈ విధంగా చేయడం దారుణమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
Also Read : ఆ వ్యాఖ్యలు నిరాధారం: లోకేష్