Saturday, January 18, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్అమరావతిపై ఒకే విధానం: సోము వీర్రాజు

అమరావతిపై ఒకే విధానం: సోము వీర్రాజు

రాజధాని అమరావతిలోనే ఉండాలనేది తమ పార్టీ విస్పష్ట అభిప్రాయమని,  దీనిలో రెండో ఆలోచనకు తావు లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు  తేల్చి చెప్పారు. రాజధాని అంశాన్ని వివాదం చేసింది టిడిపి, వైసీపీ లేనని ఆరోపించారు. గత ప్రభుత్వంలో 7,200 కోట్ల రూపాయల ఖర్చుతో ఐదు పెద్ద బిల్డింగ్ లు, అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు మాత్రమె కట్టారని, ఈ ప్రభుత్వంలో రాజధాని మారుస్తామని చెబుతున్నారని విమర్శించారు.  ప్రస్తుత ప్రభుత్వం దగ్గర రాజధానిపై ఒక స్పష్టమైన ప్రణాళిక అంటూ ఏదీ లేదని వీర్రాజు ఆరోపించారు.

కరోనా పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా CBSE మొదలుకొని, అన్ని రాష్ట్రాల బోర్డులు పరీక్షలను రద్దు చేస్తే  మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం చివరి నిమిషం వరకూ రద్దు చేయలేదని, సుప్రీంకోర్టు చెప్పేదాక  అప్పుడు నిర్ణయం తీసుకున్నారని ఎద్దేవా చేశారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు చాలా చోట్ల ఏకగ్రీవం  అయ్యాయని అందుకే ఆ ఎన్నికలను పూర్తిగా రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని కోరామని సోము వీర్రాజు తెలిపారు. మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలలో కూడా చాలా చోట్ల ఏకగ్రీవాలకు తెరతీశారు. జడ్పీటీసీ ఎన్నికలపై కోర్టు తీర్పుకు అనుగుణంగా తమ పార్టీ విధానం ఉంటుందని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్