Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్అటల్ జీ బాటలోనే మోడీ: సోము వీర్రాజు

అటల్ జీ బాటలోనే మోడీ: సోము వీర్రాజు

దివంగత  వాజ్ పేయి బాటలో నేటి ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పాడుపడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  చెప్పారు. ఎస్టీల సంక్షేమం గురించి మొదట ఆలోచించింది వాజ్ పేయి అని, వారికోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశారని, ఇప్పుడు మోడీ ఒక ఎస్టీ మహిళను దేశానికి రాష్ట్రపతిగా చేశారని  వివరించారు. సఫాయి కర్మచారి కమిషన్ కూడా వాజ్ పేయి హయంలోనే మొదటగా నియమించి, ఆ వృత్తి మీద ఆధారపడి జీవించే వారి సంక్షేమం కోసం ఆలోచన చేశారని గుర్తు చేశారు. మాజీ ప్రధాని, బిజెపి అగ్రనేత అటల్ బిహారీ వాజ్ పేయి 4వ వర్థంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నేతలు ఘనంగా నివాళులర్పించారు. అనతరం మీడియాతో మాట్లాడిన సోము దేశానికి వాజ్ పేయి సేవలను స్మరించుకున్నారు.

అప్పటి వరకూ సెప్టిక్ ట్యాంకులను మాన్యువల్ గా  క్లీన్ చేసేవారని, వాజ్ పేయి  కాలంలో ఐదు లక్షల రూపాయల విలువైన వాహనాలను ఏర్పాటు చేశారని, సఫాయిలకు రెండున్నర లక్షల రూపాయల సబ్సిడీ, మరో రెండున్నర లక్షల బ్యాంకు ఋణం ఇప్పించారని అన్నారు.

నదుల అనుసంధానం, స్వర్ణ చతుర్భుజి లాంటి ఎన్నో విప్లవాత్మక చర్యలకు అటల్ జీ శ్రీకారం చుట్టారని, నేడు ఏపీలో నాలుగు లక్షల కోట్ల రూపాయలతో కేంద్ర రోడ్లు వేస్తుందంటే ఆడినాడు ఆయన ఇచ్చిన మార్గదర్శకమన్నారు. నాడు వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడే అమెరికా కన్ను గప్పి, నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం సలహాదారుడిగా పోఖ్రాన్ అణుపరీక్ష చేస్తే ప్రపంచం నివ్వెరపోయిందన్నారు. అందుకే నిన్నటి మోడీ ఎర్రకోట ప్రసంగంలో కూడా వాజ్ పేయి పాలనా కాలాన్ని విజ్ఞాన్ అంటూ పోల్చారని వీర్రాజు చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్