Saturday, November 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్పునరావాసంపై దృష్టి పెట్టాలి: సోము

పునరావాసంపై దృష్టి పెట్టాలి: సోము

పోలవరం నిర్వాసితులకు సహాయ, పునరావాసం కల్పించే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. వారికి ఇచ్చిన హమీలనీ నేరవేర్చాలని సూచించారు. పార్టీ నేతలతో కలిసి సోము వీర్రాజు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు పనులను పరిశీలించి, పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టులో ప్రధాన భూమిక పోషిస్తోంది నిర్వాసితులు, గిరిజనులేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ 11 వేల కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు కోసం ఇచ్చిందని, దీనిలో 4 వేల కోట్లు పునరావాసం కోసం ఖర్చు చేశారని, 7 వేల కోట్లు ప్రాజెక్టుకు ఖర్చు పెట్టారని వివరించారు. ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేస్తున్నారో దానికి సమానంగా పునరావాసానికీ వెచ్చించాలని సోము విజ్ఞప్తి చేశారు.

నిర్వాసితులకు ఏర్పాటు చేస్తున్న కాలనీల్లో ఇళ్ళ నిర్మానంతోపాటు మౌలిక వసతులు కూడా కల్పించాలని సోము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 18  ఏళ్ళు నిండిన నిర్వాసితులు అందరికీ పరిహారం చెల్లించాలని కోరారు. ప్యాకేజీ విషయంలో అర్హులందరికీ న్యాయం చేయాలన్నారు. అవసరమైతే ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసుకుని, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ద్వారా నిర్వాసితులందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్