Monday, July 1, 2024
HomeTrending News6100 పోస్టులతో మెగా డీఎస్సీ: కేబినేట్ నిర్ణయం

6100 పోస్టులతో మెగా డీఎస్సీ: కేబినేట్ నిర్ణయం

రాష్ట్రంలో యువత ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు రాష్ట్ర మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 6100 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు వైఎస్సార్ చేయూత నిధుల విడుదలకు కూడా కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. అటవీ శాఖలో 689 పోస్టులు భర్తీ చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి నేడు సచివాలయంలో సమావేశమైంది. భేటీ ముగిసిన అనంతరం రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. 2019నుంచి ఇప్పటివరకూ 2 లక్షల 13 వేల పోస్టులు భర్తీ చేశామని, నేడు తీసుకున్న నిర్ణయంతో మొత్తం 2 లక్షల 20 వేల ప్రభుత్వ ఉద్యోగాలుభర్తీ చేసినట్లవుతుందని వివరించారు. విద్యా విప్లవంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఐబి విద్యావిధానం ప్రవేశపెట్టేందుకు కూడా కేబినేట్ అనుమతి మంజూరు చేసింది.

వైఎస్సార్ చేయూత ద్వారా నాలుగో విడత నిధులు దాదాపు 27 లక్షల మందికి ఒక్కొక్కరికీ 18,750 రూపాయలు చొప్పున మొత్తం 5,060.4 కోట్ల రూపాయలు అందించాలని కూడా కేబినేట్ తీర్మానం చేసింది. ఫిబ్రవరి 16 నుంచి నెలాఖరు వరకూ ఈ కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఈ చేయూత ద్వారా 14 లక్షల మంది మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమాలతో నెలకు 7 వేల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారని వివరించారు.  ఇంధన రంగంలో రూ.22,302 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ నిన్న ఆమోదించిన ప్రాజెక్టులకు కూడా కేబినేట్ ఆమోదముద్ర వేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్