Monday, January 20, 2025
HomeTrending NewsAP Cabinet: ఉద్యోగులపై కేబినెట్ వరాలు

AP Cabinet: ఉద్యోగులపై కేబినెట్ వరాలు

కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరించేందుకు ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. 2014 జూన్ 2 నాటికి ఐదేళ్ళ సర్వీసు పూర్తి చేసుకున్న దాదాపు 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధి పొందనున్నారు.  ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 12వ వేతన సవరణ సంఘం (పే రివిజన్ కమిషన్-పీఆర్సీ) ఏర్పాటుకు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) స్థానంలో  ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ స్కీం (జీపీఎస్)-2023 బిల్లుకు ఒకే చెప్పింది. ఆమోద ముద్ర వేసింది. జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు 16శాతం హెచ్ ఆర్ ఏ ఇచ్చేందుకు, జనవరి 1, 2022 నుంచి ఉద్యోగులందరికీ ఎరియర్స్ తో 2.73 శాతం డిఏ ఇచ్చేందుకు  కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించేందుకు, అమ్మ ఒడి నిధుల విడుదలకు, 6,840 గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి,  ఈ ఏడాది విద్యా కానుక అమలుకు మంత్రి మండలి సమ్మతి తెలియజేసింది. ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ను రద్దు చేస్తూ దానిలో పని చేస్తున్న 14, 653మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేసేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో కేబినేట్ భేటీ అయ్యింది.  ధాన్యం బకాయిల చెల్లింపులకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తీసుకు వచ్చిన 5వేల కోట్ల రూపాయల రుణ సేకరణసహా మొత్తం 63అంశాలకు ఆమోద ముద్ర వేసింది.

కేబినెట్ ఆమోదించిన అంశాలు: 

  • జగనన్న ఆణిముత్యాలు
  • కొత్త మెడికల్ కాలేజీల్లో 2118 పోస్టుల భర్తీ
  • పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్న పలు కంపెనీలకు భూకేటాయింపులు
  • 6840 కొత్త పోస్టుల మంజూరు
  • విశాఖ మానసిక వైద్యశాలకు 11,  కడప మానసిక వైద్య శాలకు 116 పోస్టులు
  • సీతానగరం పిహెచ్ సి అప్ గ్రేడ్ కు 23 పోస్టులు
  • 28.3 ఎకరాల భూమిని చిత్తూరు డెయిరీ 99 ఏళ్ళకు లీజు
  • పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ లోని డయాలసిస్ యూనిట్ కు 41 మెడికల్ ఆఫీసర్ పోస్టులు
  • 476 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నైట్ వాచ్ మెన్  పోస్టులు
  • కోపరేటివ్ సొసైటీల్లో సూపర్ న్యూమరీ పోస్టులు
  • నర్సాపురం ఫిషరీస్ యూనివర్సిటీ 65, ఫిషరీస్ సైన్సు కాలేజీ కు 75 పోస్టుల మంజూరు
RELATED ARTICLES

Most Popular

న్యూస్