Sunday, May 11, 2025
HomeTrending Newsకొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం

కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం

New Districts: జిల్లాల పునర్ విభజనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు కెబినెట్ ఆమోద ముద్ర వేసింది.  ఆన్ లైన్లో మంత్రుల నుంచి ఆమోదం తీసుకున్నారు. ఆన్ లైన్లోనే కొత్త జిల్లాల ఏర్పాటు వివరాలను మంత్రులకు సర్కులేట్ చేసిన ప్రభుత్వం ఆ మేరకు వారి అనుమతి తీసుకుంది.

మరోవైపు  జిల్లా కలెక్టర్లతో సీఎస్ సమీర్ శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు.

చట్టానికి అనుగుణంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ప్రాథమిక నోటిఫికేషన్ రూపొందించింది సీసీఎల్ఏ. 1974 ఏపీ జిల్లాల (ఏర్పాటు) చట్టంలోని సెక్షన్-3(5) ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. భౌగోళికంగా అరకు అతి పెద్ద నియోజకవర్గం కావడంతో దాన్ని రెండు జిల్లాలుగా విభాజించానున్నారు.

కొత్త జిల్లాలు:
కర్నూలు, నంద్యాల, అనంతపురం, హిందూపురం, కడప, చిత్తూరు, తిరుపతి, రాజం పేట, నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, నరసరావు పేట, గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం,  నరసాపురం,  అమలాపురం, రాజమండ్రి, ఏలూరు, కాకినాడ, అరకు (రెండు జిల్లాలు), శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలుగా ఏర్పాటు కానున్నాయి

ప్ర‌తి లోక్‌స‌భ  నియోజ‌క వ‌ర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామంటూ మ్యానిఫెస్టోలో వైఎస్సార్సీపీ హామీ ఇచ్చింది. పెరిగిన జ‌నాభాకు అనుగుణంగా ప‌రిపాల‌నను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాలంటే..ఇప్పుడున్న జిల్లాలతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు అవ‌స‌ర‌మ‌ని గ‌తంలో  ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

Also Read : మహిళా సాధికారత కోసమే: సిఎం జగన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్