Tuesday, March 10, 2026
HomeTrending Newsనేడు ఏపి కేబినెట్ భేటీ

నేడు ఏపి కేబినెట్ భేటీ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. స‌చివాల‌యంలో ఉద‌యం 11 గంట‌ల‌కు ఈ భేటీ మొదలు కానుంది. పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.  అన్ లైన్ లో సినిమా టికెట్లు అమ్మ‌కాల‌కు ఆర్డినెన్స్,  సినిమాటోగ్ర‌ఫి చ‌ట్టానికి స‌వ‌ర‌ణ అర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.  నవంబర్ రెండో వారంలో అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని భావిస్తున్న వాటి నిర్వ‌హ‌ణపై కూడా కేబినేట్ చర్చించనుంది.

టీటీడీలో ప్ర‌త్యేక అహ్వానితుల నియామ‌కానికి సంబంధించిన ఆర్డినెన్స్

దేవాదాయ స్థలాలు, దుకాణాల లీజుల అంశంపై దేవాదాయశాఖ చ‌ట్ట‌స‌వ‌ర‌ణ‌

దేవాదాయ శాఖలో విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీవింగ్‌ ఏర్పాటు

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ఓ శాఖ ఏర్పాటు

ప‌లు సంస్థ‌ల‌కు భూ కేటాయింపులు

లాంటి అంశాలు కేబినేట్ లో చర్చకు రానున్నట్లు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular