Thursday, January 23, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్20న కేబినేట్ భేటి : బడ్జెట్, కరోనాపై చర్చ

20న కేబినేట్ భేటి : బడ్జెట్, కరోనాపై చర్చ

రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 20వతేదీన సమావేశం కానుంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో అదేరోజు ఉదయం 8.30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరగనుంది  అదే రోజు అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. బడ్జెట్ కు లాంఛనంగా కేబినేట్ ఆమోదం తెలపనుంది. అనంతరం ఆర్ధిక శాఖామంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కూడా మంత్రివర్గంలో చర్చించనున్నారు.

కాగా, 2021-22 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.38 లక్షల కోట్ల మధ్యలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్