జూన్ 30న, బుధవారం ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మండలి సమావేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. ఒకటో నెంబర్ బ్లాక్ లో ఉన్న కేబినెట్ హాల్ లో ఈ సమావేశం జరగనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. ఈ నెల 30 వ తేదీ ఉదయం 11 గంటల నుంచి రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ప్రారంభం కానున్నట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలను ప్రతిపాదనల రూపంలో జూన్ 28 మధ్యాహ్నం ఒంటిగంట లోపు పంపాలని ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు సిఎస్ ఆదేశాలు జరీ చేశారు.
కరోనా నియంత్రణ, సంక్షేమ పథకాల అమలు, జాబ్ క్యాలండర్, నూతన ఐపి పాలసీ తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.