మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో రూ.793 కోట్ల విలువైన ఆస్తులను ఆంధ్ర ప్రదేశ్అ సీఐడీ అటాచ్ చేసింది. మార్గదర్శిలో ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఫోర్‌మెన్, ఆడిటర్‌లు కుట్రతో నేరానికి పాల్పడినట్లు సీఐడీ తెలిపింది. మార్గదర్శి చిట్స్ ద్వారా సేకరించిన డబ్బును హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు పేర్కొంది.
‘ఏపీలో 37 బ్రాంచ్‌ల ద్వారా మార్గదర్శి వ్యాపారం చేస్తోందని, 1989 చిట్స్ గ్రూప్‌లు, తెలంగాణలో 2,316 చిట్స్ గ్రూప్‌లు ఉన్నాయని వివరిస్తూ ఖాతాదారులకు వెంటనే డబ్బు ఇవ్వడంలో జాప్యం చేస్తోందని అటాచ్ మెంట్ లో ఉత్తర్వుల్లో సిఐడి పేర్కొంది.