Sunday, January 19, 2025
HomeTrending Newsమాజీ ఐఏఎస్‌కు  ఏపీ సీఐడీ నోటీసులు

మాజీ ఐఏఎస్‌కు  ఏపీ సీఐడీ నోటీసులు

CID case on IAS (Retd.):
ఐఏఎస్ విశ్రాంత అధికారి లక్ష్మీనారాయణకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల కేసులో ఏపీ సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈనెల 13న ఏపీ సిఐడి పోలీసుల ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. నేటి ఉదయం ఏపీ సిఐడి అధికారులు హైదరాబాద్ లోని అయన నివాసంలో సోదాలు చేశారు. లక్ష్మీనారాయణ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత సీఎం చంద్రబాబు దగ్గర కార్యదర్శిగా పనిచేశారు.  పదవీ విరమణ తర్వాత ఏపీ ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించారు.  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ కు సలహాదారుగా పనిచేసిన అయన  యువకులకు శిక్షణ ఇచ్చే క్రమంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో స్కిల్ డెవలప్మెంట్ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదులపై ఏపీ సిఐడి కేసులు నమోదు చేసింది. 240 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ సిఐడి తన ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొంది.

కాగా, నేడు అధికారులు సోదాలు చేస్తున్న సమయంలో లక్ష్మీ నారాయణకు హఠాత్తుగా బీపీ లెవెల్స్ పడిపోయి స్పృహ తప్పి పడిపోయారు. ఆయన్ను వెంటనే బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

Also Read : నాడు-నేడులో అవినీతి: అచ్చెన్నాయుడు

RELATED ARTICLES

Most Popular

న్యూస్