Thursday, March 19, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్సాదియాకు 5 లక్షల ఆర్ధిక సాయం

సాదియాకు 5 లక్షల ఆర్ధిక సాయం

Power Lifting: ఏసియన్‌ పవర్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ విన్నర్‌ షేక్‌ సాదియా అల్మస్‌ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు.  గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారిణి షేక్‌ సాదియా అల్మస్‌,  టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో 2021 డిసెంబర్‌లో జరిగిన ఏషియన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో 3 స్వర్ణ పతకాలు, 1 రజత పతకం సాధించారు. నేడు అసెంబ్లీ ఆవరణలోని సిఎం కార్యాలయంలో ఆమె జగన్ ను కలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున షేక్‌ సాదియాకు 5 లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని సీఎం జగన్ ప్రకటించారు. మంగళగిరి లో పవర్‌ లిఫ్టింగ్‌ అకాడమీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి  అంగీకారం తెలియజేశారు.  క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరుపున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంతామని సిఎం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, షేక్‌ సాదియా తండ్రి సంధాని, రోటరీ క్లబ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular