Sunday, January 19, 2025
HomeTrending Newsఇస్కాన్ వంటశాల ప్రారంభం

ఇస్కాన్ వంటశాల ప్రారంభం

Centralized Kitchen: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో  ఇస్కాన్‌ సంస్ధ ఏర్పాటు చేసిన అత్యాధునిక కేంద్రీకృత వంటశాలను  రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్‌.జగన్‌ మోహన్ రెడ్డి ప్రారంభించారు.  రాష్ట్ర ప్రభుత్వం తరపున పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన ఆహారాన్ని అక్షయపాత్ర పౌండేషన్‌(ఇస్కాన్‌) సంస్థ ఇక్కడే తయారు చేయనుంది. వంటశాలను ప్రారంభించిన అనంతరం అక్కడ తయారు చేసిన పల్లీ పట్టీ ని ముఖ్యమంత్రి రుచి చూశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన పలు  పాఠశాలల విద్యార్ధుల్లో కొందరికి సిఎం జగన్ స్వయంగా ఆహారాన్ని వడ్డించారు.

కార్యక్రమానికి గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఇస్కాన్‌ ప్రతినిధులు హాజరరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్