Saturday, November 23, 2024
HomeTrending Newsవనితకు హోం,  వైద్యానికి రజని

వనితకు హోం,  వైద్యానికి రజని

Portfolios: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు శాఖలు కేటాయించారు. డిప్యూటీ సిఎం లుగా ఐదుగురికి అవకాశం కల్పించారు. గతంలో డిప్యూటీ సిఎంలుగా పనిచేసిన నారాయణ స్వామి, అంజాద్ భాషాలను తిరిగి అదే హోదాలో కొనసాగించారు. పీడిక రాజన్నదొర, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడులకు డిప్యూటీ సిఎం లుగా అవకాశం కల్పించారు.

ఉప ముఖ్యమంత్రులు:

  1. నారాయణ స్వామి                      :  ఎక్సైజ్
  2. కొట్టు సత్యనారాయణ                :  దేవాదాయ ధర్మాదాయ
  3. బూడి ముత్యాల నాయుడు        :  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి
  4. అంజాద్ భాషా                             :  మైనార్టీ సంక్షేమం
  5. పీడిక రాజన్న                              :  గిరిజన సంక్షేమం

మంత్రులు:

  1. ధర్మాన ప్రసాదరావు                      : రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్
  2. బొత్స సత్యనారాయణ                 : విద్యాశాఖ
  3. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి            : విద్యుత్, అటవీ, పర్యావరణం, మైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, జియోలజీ
  4. బుగ్గన రాజేంద్రనాథ్                     : ఆర్ధిక, శాసనసభా వ్యవహారాలూ, స్కిల్ డెవలప్మెంట్, వాణిజ్య పన్నులు
  5. తావేటి వనిత                                 : హోం, ప్రకృతి విపత్తు నిర్వహణ
  6. ఆదిములపు సురేష్                       : పురపాలక, పట్టణాభివృద్ధి
  7. డా. సీదిరి అప్పలరాజు                : పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య శాఖ
  8. పి. విశ్వరూప్                                  : రవాణా శాఖ
  9. చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ   : సమాచార-పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ, బిసి సంక్షేమం
  10. గుమ్మనూరు జయరాం                  : కార్మిక, ఉపాధి కల్పన
  11. గుడివాడ అమర్నాథ్                     : ఐటి, పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక వసతులు
  12. దాడిశెట్టి రాజా                                : రోడ్లు, భవనాలు
  13. కారుమూరి నాగేశ్వరరావు              : పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు
  14. జోగి రమేష్                                      : గృహ నిర్మాణ శాఖ
  15. మేరుగు నాగార్జున                          : సాంఘిక సంక్షేమ శాఖ
  16. అంబటి రాంబాబు                         : జల వనరుల శాఖ
  17. కాకాణి గోవర్ధన్ రెడ్డి                         : వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు
  18. విడదల రజని                                 : ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖలు
  19. ఆర్కే రోజా                                        : పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు
  20. కేవీ ఉష శ్రీ చరణ్                           : మహిళా, శిశు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ

శాఖల కేటాయింపులో పదనిసలు:

  • మేకపాటి గౌతమ్ రెడ్డి నిర్వహించిన శాఖలు గుడివాడ అమర్నాథ్ కు కేటాయించారు
  • ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణల శాఖలు ఇటూ ఇటూ మారాయి
  • గత కేబినెట్ లో ఉన్న వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పల రాజు, బుగ్గన రాజేంద్రనాథ్ ల శాఖలు మారలేదు.
  • వేణుగోపాల కృష్ణకు అదనంగా ఐ అండ్ పీ ఆర్; సినిమాటోగ్రఫీ దక్కాయి
  • ధర్మాన కృష్ణ దాస్ నిర్వహించిన రెవిన్యూ శాఖను అయన సోదరుడు  ధర్మాన ప్రసాదరావుకు కేటాయించారు
  • పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గతంలో నిర్వహించిన గనులు, భూగర్భ వనరుల శాఖలను అలాగే ఉంచి, గతంలో బాలినేని నిర్వహించిన  విద్యుత్, ఇతర శాఖలను అప్పగించారు
  • పెద్దిరెడ్డి గతంలో నిర్వహించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను బూడి ముత్యాల నాయుడుకు అప్పగించారు.

Also Read : కొలువు తీరిన కొత్త మంత్రివర్గం

RELATED ARTICLES

Most Popular

న్యూస్