ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజులపాటు ఢిల్లీ లో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ఆయన ఢిల్లీ బయల్దేరి వెళ్తారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా హోంమంత్రి అమిత్‌షా, జలవనరుల శాఖమంత్రి గజేంద్ర సింగ్‌షెకావత్ సహా పలువురు ఇతర కేంద్రమంత్రులను కూడా సీఎం జగన్ కలుసుకుంటారు. పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వారితో చర్చిస్తారు.
కోవిడ్ వ్యాక్సినేషన్, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, పెండింగ్ లో ఉన్న ఇతర అంశాలపై అయన కేంద్ర మంత్రులతో చర్చిస్తారు. రఘురామకృష్ణం రాజు వ్యవహారం, వ్యాక్సిన్ విషయంలో అన్ని రాష్ట్రాల సిఎం లకు జగన్ లేఖ రాయడం తదితర పరిణామాల నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ సోమవారమే జగన్ ఢిల్లీ వెళ్ళాల్సి ఉండగా, చివరి నిమిషంలో అమిత్ షా బిజీగా ఉండడంతో పర్యటన వాయిదా పడింది.