Saturday, January 18, 2025
HomeTrending Newsరైతన్నకు అండగా 83 వేల కోట్లు ఖర్చుచేశాం : జగన్

రైతన్నకు అండగా 83 వేల కోట్లు ఖర్చుచేశాం : జగన్

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం తమదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  23 నెలల పాలనలో రైతులకు రూ. 83 వేల కోట్లకు పైగా ఖర్చు  చేశామని వెల్లడించారు.  గత ప్రభుత్వాలు ఇన్సూరెన్స్, ఇన్ పుట్ సబ్సిడీలను నిర్లక్ష్యం చేశాయన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఖరీఫ్ లో పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్ లో పరిహారం చెల్లిస్తున్నామని, రైతులపై భారం పడకుండా బీమా మొత్తాన్ని రైతుల తరఫున ప్రభుత్వమే చెల్లిస్తోందని వివరించారు

సిఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ ఉచిత పంటల భీమా నిధులు ముఖ్యమంత్రి విడుదల చేశారు. కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లోకి నగదు జమ జేశారు. 2020 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన 15.15 లక్షల మంది రైతులకు రూ.1,820.23 కోట్లు బీమా పరిహారం కింద నేడు చెల్లించారు.  2019 2020 లో రూ. 1252.18 కోట్లు, 2018-19 సంవత్సరానికి గత ప్రభుత్వం బకాయిలు రూ. 715 కోట్లు కలిపి ఈ 23 నెలల కాలంలో రైతుల భీమా కోసం మొత్తం రూ. 1968.02 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది.

ప్రతి 2 వేల జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేశామని,  వీటితో పాటు రాష్ట్రంలో మొత్తం 10,778 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు చేశామని వివరించారు. ఆర్బీకేల ద్వారా రైతులకు  నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామని చెప్పారు.  వైఎస్సార్ జలకళ ద్వారా రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తున్నామని, చిన్న, సన్నకారు రైతులకు మోటార్లు కూడా బిగిస్తున్నామని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్