నేడు (జూలై 8న) దివంగత నేత, డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా అయన కుమారుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రికి నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు.
చెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం
పోరాడే గుణమే నువు ఇచ్చిన బలం
మాట తప్పని నైజం నువు నేర్పిన పాఠం
నీ ఆశయాలే నాకు వారసత్వం
ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా…
పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా..
జన్మదిన శుభాకాంక్షలు నాన్నా అంటూ ట్వీట్ చేశారు.
వైఎస్సార్ జన్మదినోత్సవాన్ని ప్రభుత్వం రైతు దినోత్సవం’ గా జరుపుతోంది. అనంతపురము జిల్లాలో జరిగే పలు కార్యక్రమాల్లో సిఎం జగన్ పాల్గొంటున్నారు.