Tuesday, February 4, 2025
HomeTrending Newsశేషాద్రి మృతి పట్ల సిఎం దిగ్భ్రాంతి

శేషాద్రి మృతి పట్ల సిఎం దిగ్భ్రాంతి

తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి  హఠాన్మరణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 1978 నుంచి శ్రీవారి సేవలో తరిస్తూ వస్తున్న శేషాద్రి మృతి చెందడం బాధాకరమని సిఎం విచారం వెలిబుచ్చారు.  నేడు విశాఖలో టిటిడి నిర్వహిస్తున్న కోటి దీపోత్సవంలో పాల్గొనేందుకు వెళ్ళిన శేషాద్రి శ్రీవారి సేవలోనే తుది శ్వాస విడిచారని సిఎం అన్నారు. శేషాద్రి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు.

శేషాద్రి ధన్యజీవి అని టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అభివర్ణించారు. శ్రీవారికి సేవ చేయడమే ఊపిరిగా భావించారని, అయన మరణం టిటిడికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు.

Also Read : డాలర్ శేషాద్రి కన్నుమూత

RELATED ARTICLES

Most Popular

న్యూస్