Saturday, January 18, 2025
HomeTrending Newsప్రధాని మోడికి జగన్ మరో లేఖ

ప్రధాని మోడికి జగన్ మరో లేఖ

కృష్ణా జలాల వివాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోడికి సిఎం జగన్ మరో లేఖ రాశారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబి)  ప్రోటోకాల్ ను ఉల్లంఘించి తెలంగాణా ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తోందని ఆరోపించారు. కేఆర్ఎంబి పరిధిని వెంటనే నోటిఫై చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

జగన్ రాసిన లేఖలోని ముఖ్యాంశాలు:

  • అవసరం లేకపోయినా విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని వృధా చేస్తున్నారు
  • తెలంగాణ ప్రభుత్వం జూన్ 1 నుంచి విద్యుత్ ఉత్పత్తిని రెట్టింపు చేసింది
  • శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చిన 26 టిఎంసీల నీటిలో 19 టిఎంసీలు విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించింది, ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలి
  • ఆంధ్రప్రదేశ్ అధికారులకు సమాచారం ఇవ్వకుండానే పులిచింతల నుంచి నీరు విడుదల చేస్తున్నారు
  • తెలంగాణా ప్రభుత్వం నీటి విషయంలో పదే పదే ఉల్లంఘనలకు పాల్పడుతోంది
  • ఈ విషయమై కేంద్ర జల శక్తి శాఖకు ఎన్నో ఫిర్యాదులు చేశాం
  • తెలంగాణ ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్న కేఆర్ఎంబి మేము ఇస్తున్న ఫిర్యాదులను పట్టించుకోవడం లేదు
  • తెలంగాణ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు పూర్తయితే శ్రీశైలం లో చుక్క నీరు కూడా మిగలదు, దిగువ ప్రాంతాలకు నీరు ఇచ్చే పరిస్థితి ఉండదు
  • వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది
  • ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద సి ఆర్ పి ఎఫ్ అధికారులతో భద్రత కల్పించాలి
  • ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాలు కాపాడాలి
  • కేంద్ర జల శక్తి శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వండి
RELATED ARTICLES

Most Popular

న్యూస్