Sunday, February 23, 2025
HomeTrending Newsఅల్లూరికి సిఎం జగన్ నివాళి

అల్లూరికి సిఎం జగన్ నివాళి

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, తదితరులు పాల్గొన్నారు.

 తెలుగుజాతి తెగువకు నిలువెత్తు నిదర్శనమైన మన్యం వీరుడు అల్లూరి జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమని సీఎం వైఎస్‌ జగన్‌ కొనియాడారు. ఈ మేరకు ‘ప్ర‌జ‌ల హ‌క్కుల కోసం, స్వాతంత్య్ర పోరాటం కోసం బ్రిటీష్ సామ్రాజ్య‌మ‌నే మ‌హాశ‌క్తిని ఢీకొన్న విప్ల‌వ వీరుడు అల్లూరి సీతారామ‌రాజు. తెలుగుజాతి తెగువకు నిలువెత్తు నిదర్శనమైన మన్యం వీరుడు అల్లూరి జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకం. అల్లూరి జ‌యంతి సంద‌ర్భంగా ఘ‌న నివాళుల‌ర్పిస్తున్నా’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్