Monday, January 20, 2025
HomeTrending Newsగవర్నర్ కు సిఎం పరామర్శ

గవర్నర్ కు సిఎం పరామర్శ

AP Cm Jagan Phone Call To Governor Inquired About His Health :

కోవిడ్ లక్షణాలతో బాధపడుతూ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏసియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజి)  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. శాసనసభ విరామ సమయంలో గవర్నర్‌ కు ఫోన్ చేసి మాట్లాడారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చినట్లు వైద్యులు చెప్పారని సిఎం వెల్లడించారు.

కాగా సిఎం జగన్ నిన్ననే ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.  ఏఐజీ చైర్మన్‌, సీనియర్‌ వైద్యుడు డాక్టర్‌ డి.నాగేశ్వర్‌ రెడ్డితో నేరుగా ఫోన్‌లో మాట్లాడిన సీఎం  గవర్నర్‌ ఆరోగ్యం, అందిస్తున్న వైద్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గవర్నర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్‌ నాగేశ్వర రెడ్డి సిఎంకు తెలిపారు.

Also Read :  గవర్నకు అస్వస్థత : ఏఐజిలో చికిత్స

RELATED ARTICLES

Most Popular

న్యూస్