CM in Delhi: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు, రెండ్రోజులపాటు అయన దేశ రాజధానిలో ఉండనున్నారు. ఈ సాయంత్రం 4.45 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాత్రి 9.30 గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తోను జగన్ సమావేశం కానున్నారు.
జవనరి మొదటి వారంలో కూడా రెండ్రోజుల పాటు ఢిల్లీ లో పర్యటించిన జగన్ ప్రధాని మోడీ తో పాటు, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ లను కలుసుకున్నారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, కొత్త జిల్లాల ఏర్పాటు, మూడు రాజధానులు, పోలవరం, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు అంశాలను సిఎం ప్రధాని, హోం మంత్రి తో పాటు పలువురు కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించనున్నారు.
ఢిల్లీ చేరుకున్న సిఎం జగన్ కు వైఎస్సార్సీపీ ఎంపీలు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.
Also Read : వికేంద్రీకరణ మా మౌలిక సిద్దాంతం: జగన్