వ్యాక్సిన్ విధానంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. వ్యాక్సిన్ విషయంలో అందరం ఒకే మాటపై ఉందామని సూచించారు. కేంద్రమే వ్యాక్సిన్లు కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇవ్వాలని, ఈ విషయంలో సిఎం లు అందరూ కలిసి కేంద్రాన్ని అడుగుదామని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ సరఫరాపై అన్ని రాష్ట్రాలూ పరస్పరం సహకరించుకోవాలని కోరారు.
వ్యాక్సిన్లకు గ్లోబల్ టెండర్ల అంశం కూడా జగన్ లేఖలో ప్రస్తావించారు, ఈ అంశం కేంద్రం పరిధిలో ఉందని, అందుకే ఒక్కరూ టెండర్ బిడ్ లో పాల్గొనలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ విషయంలో కేంద్రం వర్సెస్ రాష్ట్రం అన్నట్లుగా పరిస్థితి తయారైందని, ఇది దురదృష్టకరమని లేఖలో జగన్ పేర్కొన్నారు.