Monday, January 20, 2025
HomeTrending Newsబాబాసాహెబ్ కు సిఎం జగన్ నివాళి

బాబాసాహెబ్ కు సిఎం జగన్ నివాళి

Johar Dr. BR Ambedkar :
భారత రాజ్యంగ నిర్మాత డా. బాబా సాహెబ్ భీం రావు అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా భారత జాతి ఆయనకు ఘనంగా  నివాళులర్పిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి లోని సిఎం క్యాంపు కార్యాలయంలో అయన చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాదిగ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కె కనకారావు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

“నేడు బాబా సాహెబ్ వ‌ర్ధంతి… ఆయన భావాలకు ఏనాటికీ మరణం లేదు. గత 100 సంవత్సరాలుగా భారత సామాజిక, ఆర్థిక, రాజకీయ, రాజ్యాంగ అంశాలమీద ఆయన ముద్ర చెక్కుచెదరలేదు. సామాజిక న్యాయంతో కూడిన స్వాతంత్య్రం, సమానత్వాలకు ఆయన చెప్పిన అర్థం ఇప్పుడు మనందరి ప్రభుత్వంలో మనసా వాచా కర్మణా సాకారమవుతోంది” అంటూ సిఎం జగన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Also Read : బాబుకు ప్రతిరోజూ విషాద దినమే: రాంబాబు

RELATED ARTICLES

Most Popular

న్యూస్