Saturday, June 29, 2024
HomeTrending Newsనేడు జగనన్న తోడు వడ్డీ నిధుల జమ

నేడు జగనన్న తోడు వడ్డీ నిధుల జమ

జగనన్న తోడు వడ్డీ సొమ్మును ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.  క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు.

అధిక వడ్డీల బారినుంచి చిరు వ్యాపారులను రక్షించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమం జగనన్న తోడు.  తొలిదశ 2020 నవంబర్‌లో రుణాలు తీసుకుని 30 సెప్టెంబర్, 2021 నాటికి సకాలంలో చెల్లించిన 4,50,546 మంది లబ్ధిదారులకు రూ.16.36 కోట్ల వడ్డీని  తిరిగి లబ్ధిదారుల ఖాతాల్లోకి  తిరిగి జమచేయనున్నారు.

ఇంకా సంవత్సర రుణ కాలపరిమితి ముగియని లబ్ధిదారులు వారి రుణాలను సకాలంలో చెల్లించిన వెంటనే వారు చెల్లించిన వడ్డీని వారి ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది ప్రభుత్వం.  పూర్తి వడ్డీభారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి ఏటా రూ. 10 వేల చొప్పున ఇప్పటివరకు మొత్తం 9,05,458 మందికి రూ. 905 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించింది ప్రభుత్వం.  నిరుపేదలైన చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి ఏటా రూ. 10,000 వడ్డీలేని రుణం అందిస్తోంది.  రుణం తీర్చిన తర్వాత లబ్దిదారులు, వారి కోరిక మేరకు బ్యాంకుల నుండి మళ్ళీ వడ్డీ లేని రుణం పొందవచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్