రాష్ట్రంలో నెలాఖరు వరకూ కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పరిస్థితిపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కర్ఫ్యూ ను నెలాఖరు వరకూ కొనసాగించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో కర్ఫ్యూపెట్టి ¬10 రోజులు మాత్రమే అయ్యిందని, పరిస్థితి అదుపులోకి రావాలంటే మరికొంత సమయం పడుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. కేసులు తగ్గాలంటే కనీసం 4 నుంచి 6 వారాల వరకూ కర్ఫ్యూ అమలు చేయాల్సి ఉంటుందని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ, ఆశా వర్కర్ల సేవలు వినియోగించుకోవాలని జగన్ పేర్కొన్నారు.
కోవిడ్ తో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలను అడుకునేదుకు చర్యలు తీసుకోవాలని, పిల్లలకు ఆర్ధిక సాయంపై కార్యాచరణ రూపొందించాలని అధికారులను జగన్ ఆదేశించారు.