DGP transferred: రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ (డిజిపి) గౌతమ్ సావాంగ్ ను బదిలీ అయ్యారు. కొత్త పోలీస్ బాస్ గా ప్రస్తుతం ఇంటలిజెన్స్ డైరెక్టర్ జనరల్ గా ఉన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ని నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. గౌతం సావాంగ్ ను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొద్ది సేపటి క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ జీవో విడుదల చేశారు.
డ్రగ్స్ వ్యవహారం, విజయవాడలో ఇటీవల జరిగిన టీచర్ల ర్యాలీ ని అడ్డుకోవడంలో పోలీసు శాఖ నిర్లక్ష్యం వహించిందని, దీనిపై సిఎం జగన్ కూడా డిజిపి సావాంగ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.
అధికారం చేపట్టి మూడేళ్ళు దగ్గరపడుతున్న తరుణంలో పరిపాలనా యంత్రాంగంపై సిఎం దృష్టి సారించారు. చాలా కాలంగా వివాదాస్పదంగా తయారైన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ను కూడా నిన్న బదిలీ చేస్తూ ఢిల్లీ లోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా నియమించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటున్న పలు కీలక అంశాలలో ప్రవీణ్ ప్రకాష్ అనుసరిస్తున్న ధోరణి కారణమని సిఎం కు ఫిర్యాదులు అందాయి.