వంశధార ప్రాజెక్టుపై నేరడి బ్యారేజిని 2024 నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనికుమార్ ప్రకటించారు. ఓడిషా ప్రభుత్వంతో అతి త్వరలో మరోసారి చర్చలు జరుపుతామని వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో నేరడి బ్యారేజికి శంఖుస్థాపన చేస్తామన్నారు. నేరేడు బ్యారేజితో ఆంధ్ర ప్రదేశ్, ఓడిశా రెండు రాష్ట్రాలకూ ఉపయోగమని అనిల్ చెప్పారు. వంశధార ప్రాజెక్టుకు ఆయువు పట్టుగా భావిస్తున్న ప్రతిపాదిత నేరడి బ్యారేజ్ నిర్మాణ స్థలాన్ని కాట్రగడ వద్ద
డిప్యూటీ సిఎం ధర్మాన కృష్ణ దాస్, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, కలావతి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ లతో కలిసి మంత్రి అనిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా వంశధార వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఇటీవల ఇచ్చిన తీరును మంత్రి గుర్తు చేశారు.
నేరడి బ్యారేజ్ నిర్మాణం పూర్తయితే శ్రీకాకుళం జిల్లాలో రెండున్నర లక్షలు, ఓడిశాలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈబ్యారేజ్ కోసం గతంలో తయారు చేసిన సమగ్ర నివేదిక (డి పి ఆర్) గడువు ముగిసినందున కొత్త డిపిఆర్ తయారు చేయాలని అధికారులకు సూచించామని మంత్రి చెప్పారు, ఇప్పటి అంచనాల ప్రకారం 630 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. నేరడి బ్యారేజ్ త్వరగా పూర్తి చేయాలని సిఎం జగన్ స్పష్టంగా చెప్పారని, అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అనిల్ వివరించారు.
ఒడిశాలో ముంపునకు గురవుతున్న వంద ఎకరాల భూమిని సేకరించడానికి, లేదా ప్రత్యామ్నాయ స్థలం కొనుగోలుకు రెవెన్యూ అధికారులు నివేదికలు తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం ధర్మాన.