Thursday, May 8, 2025
HomeTrending Newsవిజ్ఞతతో మాట్లాడాలి :ధర్మాన సూచన

విజ్ఞతతో మాట్లాడాలి :ధర్మాన సూచన

తెలంగాణా మంత్రులు విజ్ఞతతో మాట్లాడాలని ఏపి డిప్యూటీ ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ హితవు పలికారు. విభజన చట్టం ప్రకారమే నీటి వాటాను ఉపయోగించుకుంటున్నామని వెల్లడించారు. విద్యుదుత్పత్తి కోసం నీరు వాడుకుంటూ సాగునీటి కోసం అల్లాడుతున్న రైతులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. దివంగత నేత వైఎస్, ముఖ్యమంత్రి జగన్ లపై తెలంగాణా మంత్రులు, నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని, రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణా నేతలు మాట్లాడుతున్నారని ధర్మాన ఆరోపించారు.

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కృత నిశ్చయంతో  ఉన్నామని, త్వరలో నేరడి బ్యారేజ్ కు శంఖుస్థాపన చేస్తామని కృష్ణ దాస్ వివరించారు. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణానికి వంశధార నీటి వివాదాల ట్రైబ్యునల్‌ అనుమతివ్వడాన్ని స్వాగతిస్తున్నామని, దీని ద్వారా శ్రీకాకుళం జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ధర్మాన చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్